'మండలంలో నామినేషన్లకు 9 క్లస్టర్ కేంద్రాలు'
BHPL: మలహర్రావు మండలంలోని 15 గ్రామ పంచాయతీల నామినేషన్ల స్వీకరణ కోసం 9 క్లస్టర్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో క్రాంతి కుమార్ ఇవాళ తెలిపారు. MPDO మాట్లాడుతూ.. తాడిచెర్ల, పెద్దతుండ్ల, కొయ్యూరు, వల్లెంకుంట, అన్సాన్‌పల్లి క్లస్టర్లలో సంబంధిత గ్రామాల నామినేషన్లు స్వీకరిస్తారు. అభ్యర్థులు తమ క్లస్టర్ కేంద్రంలోనే నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు.