వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
MBNR: జిల్లాలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా వడదెబ్బపై తీసుకోవాల్సిన జాగ్రత్తల పోస్టర్‌ను కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆవిష్కరించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావద్దని, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఎండల పట్ల అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. నివారణ చర్యలపై టాస్క్ ఫోర్స్ కమిటీతో సమీక్ష నిర్వహించారు.