VIDEO: అగ్ని ప్రమాద బాధితులకు జనసేన సాయం

VIDEO: అగ్ని ప్రమాద బాధితులకు జనసేన సాయం

E.G: గోకవరం(మం) రంప ఎర్రంపాలెం గ్రామంలోని గంగాభవాని నగర్‌లో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తాటాకు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న జగ్గంపేట జనసేన ఇంఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ మంగళవారం గ్రామాన్ని సందర్శించి, కాలిపోయిన ఇళ్లను పరిశీలించారు. బాధిత కుటుంబాలకు నాలుగు బియ్యం బస్తాలు, నిత్యావసర సరుకులు అందజేశారు.