VIDEO: జాతీయ రహదారిపై వరిగడ్డి లారీకి మంటలు

కృష్ణా: మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ప్రమాదం సంభవించింది. పమిడిముక్కల మండలం మంటాడ బైపాస్ సమీపంలో వరిగడ్డి లారీకి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. లారీ సైతం పూర్తిగా కాలిపై అవకాశం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.