VIDEO: చిలకలూరిపేటలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
PLD: ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి విడదల రజిని నేతృత్వంలో సాగిన ఈ ర్యాలీలో చిలకలూరిపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.