బ్రహ్మరథోత్సవంలో పాల్గొన్న పరిటాల శ్రీరామ్

సత్యసాయి: ధర్మవరం పట్టణంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి రథోత్సవం కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ శనివారం పాల్గొన్నారు. లక్ష్మీ చెన్నకేశవ స్వామిని దర్శించుకున్న ఆయన, స్వామి వారికి కానుకలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ రథోత్సవం సందర్భంగా భక్తుల సందడి కనిపించింది.