శిక్షణ తరగతుల కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ

NLG: టీఆర్‌జీఎస్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 24, 25 తేదీలలో నిర్వహించే రాష్ట్ర శిక్షణ తరగతుల కరపత్రాలను ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఈరోజు మిర్యాలగూడలోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రవి నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్ర శంకర్ నాయక్, రాష్ట్ర సహాయ కార్యదర్శి రమావత్ నరేష్ నాయక్, భాగ్య పాల్గొన్నారు.