VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

కోనసీమ: అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మచ్చ రాజు అనే వ్యక్తి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ అగ్నిప్రమాదంలో గృహోపకరణాలు, విలువైన సామగ్రి, దుస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయగా, రెవెన్యూ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. సర్వస్వం కోల్పోయిన ఆ కుటుంబం రోడ్డున పడింది.