పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి: సీపీఐ

పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి: సీపీఐ

KRNL: వెల్దుర్తి పాత బస్టాండ్ వద్ద CPI రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు బుధవారం ధర్నా చేశారు. వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.