సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో సుబ్బులక్ష్మి జయంతి

సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో సుబ్బులక్ష్మి జయంతి

NTR: గంపలగూడెం మండలం పెనుగొలనులో మంగళవారం సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత విద్వాంసురాలు భారతరత్న ఎంఎస్.సుబ్బులక్ష్మి జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 10కి పైగా భాషల్లో ఎన్నో కృతులు, కీర్తనలు, శాస్త్రీయ లలిత గీతాలు, భజనలు, అభాంగాలు, జానపద, దేశభక్తి గేయాలు పాడారని, పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించారని వారు అన్నారు.