పేకాట స్థావరంపై దాడులు.. 17 మంది అరెస్ట్
KNR: సుభాష్‌నగర్లో అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై త్రీటౌన్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఎస్సై చేరాలు కథనం ప్రకారం.. ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 6,74,280 నగదు 16 సెల్‌ఫోన్లు, 104 పేకాట ముక్కలతో పాటు రెండు కార్లు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు.