VIDEO: ఇసుక అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ దాడులు

VIDEO: ఇసుక అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ దాడులు

HNK: ఐనవోలు మండలం లింగమూరిగూడెంలో ఇసుక అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక హిటాచి, రెండు జేసీబీలు, 12 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.60 వేల విలువైన 60 టన్నుల ఇసుకతో పాటు రూ.1.31కోట్ల విలువైన యంత్ర పరికరాలను జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, దర్యాప్తు కొనసాగుతుంది.