కొనసాగుతున్న పోలవరం నిర్వాసితుల దీక్ష

కొనసాగుతున్న పోలవరం నిర్వాసితుల దీక్ష

E.G: గోకవరం మండల కేంద్రంలో పోలవరం నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష బుధవారం నాటికి రెండోవ రోజుకు చేరుకుంది. కోర్టులో ఉన్న తొమ్మిది ఎకరాల భూమి సమస్య పరిష్కారం చేయాలని, 120 మంది లబ్ధిదారులకు గృహాలు నిర్మించాలని, గ్రామాలు ఖాళీ చేసినప్పటి నుంచి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అందేలా చూడాలని వారు డిమాండ్ చేశారు.