సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
NLR: పెంచలకోన మండలంలో రాపూరు టీడీపి అతిథి గృహంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కలువాయి సైదాపురం, రాపూరు మండలాలకు చెందిన 24 మందికి రూ.22 లక్షలు విలువ చేసే చెక్కులను అందజేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో మొత్తం రూ.51 కోట్ల చెక్కులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.