నేడు విద్యుత్ అంతరాయం

నేడు విద్యుత్ అంతరాయం

KNR: విద్యుత్ మరమ్మతులలో భాగంగా ఆదివారం కరీంనగర్ టౌన్‌లో 33/11 KV బ్యాంకు కాలనీ, 11 KV మెహర్ నగర్ సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని కరీంనగర్ టౌన్-1 ఏడిఈ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. డీమార్ట్, మెహర్ నగర్, NCC ఆఫీస్, గౌడ హాస్టల్, సూర్య నగర్, శుభం గార్డెన్, V-park ముందు భాగం, సీతారాంపూర్‌లలో అంతరాయం ఉంటుంది అన్నారు.