ఊర్కోండ మండలంలో ఘనంగా బోనాల ఉత్సవాలు

ఊర్కోండ మండలంలో ఘనంగా బోనాల ఉత్సవాలు

NGKL: ఊర్కొండ మండలంలోని ఊర్కొండ పెట్, ముచర్లపల్లి, జాకినాలపల్లి, ఇప్పపహాడ్ తదితర గ్రామాల్లో గురువారం బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బోనాలతో అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.