దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

సత్యసాయి: నంబులపూలకుంట మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పంటలు, మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ సోమవారం నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారికి ఎంత మేరకు నష్టం వాటిల్లిందో తెలుసుకున్నారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఆందోళన చెందవద్దని తెలిపారు.