శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్

NRML: భైంసా గణేశ్ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే నిమజ్జన శోభాయాత్ర మార్గాన్ని సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ పరిశీలించారు. ఏఎస్పీ అవినాశ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ కలిసి పట్టణంలోని ప్రధాన మార్గంలో నిర్వహించే శోభాయాత్ర రహదారులను పరిశీలించారు. అక్కడి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు.