VIDEO: ఊబలంకలో నీట మునిగిన రోడ్లు

VIDEO: ఊబలంకలో నీట మునిగిన రోడ్లు

కోనసీమ: రావులపాలెం మండలంలోని ఊబలంక గ్రామంలో గురువారం కుండపోత వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో గ్రామంలోని కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయం వీధిలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మోకాళ్ల లోతు నీటిలో రహదారులు మునిగిపోయాయి. దీంతో స్థానిక ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అదేవిధంగా ప్రాథమిక పాఠశాల చుట్టూ కూడా వర్షపు నీరు నిలిచిపోయింది.