VIDEO: వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక మంగళహారతి పూజలు
MDK: పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లి శివారులో వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాతకు సోమవారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాల్గుణ మాసం ద్వాదశి ఇందువాసరే పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో వేదోక్తంగా అభిషేకం పూజలు చేపట్టారు. అనంతరం మహా మంగళహారతి నిరాజనం నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు.