వినాయక నవరాత్రి భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

NLG: నల్లగొండ, నకిరేకల్ పట్టణాల్లోని వినాయక మండపాలను SP శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా సాగేందుకు పోలీసులు అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మండప నిర్వాహకులు విద్యుదీకరణ జాగ్రత్తలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు వహించాలన్నారు.