ఉత్తరాఖండ్ వరదలు.. ఇస్రో కీలక నివేదిక

ఉత్తరాఖండ్ వరదలు.. ఇస్రో కీలక నివేదిక

ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో గతేడాది సంభవించిన వరదలపై ఇస్రో కీలక నివేదికను విడుదల చేసింది. ఈ ఆకస్మిక వరదలకు కారణం క్లౌడ్ బరస్ట్ కాదని స్పష్టం చేసింది. ఉత్తర కాశీకి పైన ఉన్న ప్రాంతాల్లో ఎక్కడా నదులు లేవని.. అక్కడ ఉన్న మంచు పర్వతం కరగడం వల్ల ఈ వరదలు వచ్చినట్లు పేర్కొంది. మంచు పర్వతాలపై రక్షణగా ఉండే పొరలు గ్లోబల్ వార్మింగ్ మూలంగా కరిగిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పింది.