VIDEO: కామారెడ్డిలో హోలీ సంబరాలు
కామారెడ్డిలో హోలీ సంబరాలు మంగళవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ ఏడాది రసాయన రంగులకు స్వస్తి పలికి, ప్రజలు ప్రకృతి సిద్ధమైన రంగులతో పండుగను జరుపుకోవడం విశేషం. పర్యావరణానికి హాని కలగకుండా సహజ రంగులను వాడటంపై యువత, చిన్నారులు అవగాహన ప్రదర్శించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.