VIDEO: వర్షానికి కూలిన ఇల్లు.. తప్పిన ప్రమాదం

NRML: తానూర్ మండలంలోని కోలూర్ గ్రామంలో కురిసిన వర్షానికి ఓ పాత పెంకుటిల్లు కూలిపోయింది. గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆదివారం ఉదయం ఇల్లు నేలమట్టమైంది. గ్రామానికి చెందిన షేక్ ఉమర్ అనే వ్యక్తికి చెందిన పెంకుటిల్లు పైకప్పు కూలి నేలమట్టమైంది. ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.