ఈ యుద్ధం అణు దాడులకు దారి తీయొచ్చు: WHO
పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంపై WHOపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ యుద్ధం అణు విపత్తుకు దారి తీసే పరిణామాలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవేళ అణు ప్రమాదం సంభవిస్తే, దాని పర్యవసానాలు యుద్ధం జరుగుతున్న దేశాలకే పరిమితం కావని అంచనా వేసింది. అలాగే తరతరాల ఆరోగ్య వ్యవస్థపై, పర్యావరణంపై రేడియేషన్ కోలుకోలేని దెబ్బ తీస్తుందని హెచ్చరించింది.