సొంత ఊరిలో 'బ్యాండ్ మేళం' దర్శకుడికి ఘన స్వాగతం

సొంత ఊరిలో 'బ్యాండ్ మేళం' దర్శకుడికి ఘన స్వాగతం

JGL: 'బ్యాండ్ మేళం' చిత్ర దర్శకుడు జవ్వాజి సతీష్ తన సొంత గ్రామమైన ఇబ్రహీంపట్నంకు చేరుకోవడంతో గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం సర్పంచ్ బద్దం గోపి, ఉపసర్పంచ్ నాంపెల్లి రమేష్, ఆయన చిన్ననాటి స్నేహితులు సతీష్‌ను ఘనంగా సత్కరించారు. సతీష్ భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తీసి ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా ఎదగాలని గ్రామస్థులు కోరారు.