'మూల్యాంకన నియామకాల్లో లోపాలను సరిచేయాలి'
SKLM: పదవ తరగతి మూల్యాంకన నియామకాల్లో లోపాలను సరిచేయాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పేడాడ క్రిష్ణారావు కోరారు. హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో పనిచేస్తున్న పీజీటీ లు పదవ తరగతి సబ్జెక్టులు డీల్ చేయనప్పటికీ వారిని అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా నియమించడం సరికాదన్నారు. సీనియారిటీ ప్రకారం మూల్యాంకనం విధులు కేటాయించాలన్నారు.