ముత్యాలమ్మ హుండీ ఆదాయం ఎంతంటే..?

ముత్యాలమ్మ హుండీ ఆదాయం ఎంతంటే..?

W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలోని శ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారి హుండీ లెక్కింపును భీమవరం దేవాలయ ధర్మాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. 55 రోజులకు రూ.12,05,166 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో అరుణ్ కుమార్ తెలిపారు. ఇందులో ఛైర్మన్ కడలి మాణిక్యాలరావు, పాలకవర్గం సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.