'సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిది'
అన్నమయ్య: CMRF నిరుపేదలకు వరం లాంటిదని రాజంపేట టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. రాజంపేటలోని టీడీపీ కార్యాలయంలో గురువారం సీఎం సహాయ నిధి నుండి మంజూరైన రూ.11.67 లక్షల చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలబడుతోందన్నారు.