BREAKING: ఎన్నికల హామీ.. ప్రతి ఇంటికి ఫ్రిజ్
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు హామీల జల్లు కురిపిస్తున్నాయి. అన్నాడీఎంకే విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రతి ఇంటికీ ఉచితంగా ఫ్రిజ్, మహిళల స్కూటీ కోసం రూ.25 వేలు ఇస్తామని ప్రకటించింది. మహిళలతో పాటు పురుషులకూ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. రేషన్‌లో ఉచితంగా కేజీనూనె, కందిపప్పు, పేదలకు అమ్మ ఇళ్లు అందిస్తామని పేర్కొంది.