మరణంలోను వీడని స్నేహబంధం..!
SRCL: చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన రిటైర్డ్ పోస్ట్ మెన్ భోజరాజు యాదగిరి బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. యాదగిరి మిత్రుడు అదే గ్రామానికి చెందిన రిటైర్డ్ అటెండర్ మౌలానా గుండె పోటుతో మృతి చెందాడు. తన స్నేహితుడు మౌలానా మరణించాడనే విషయం తెలుసుకున్న రిటైర్డ్ పోస్ట్ మెన్ యాదగిరి ఒక్కసారిగా గుండెపోటుకులోనై మృతి చెందాడు.