పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్
ASF: మోడల్ స్కూల్‌లోని పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హరిత సందర్శించారు. పరీక్షల నిర్వహణను పరిశీలించి, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను సమీక్షించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ధైర్యం చెప్పారు. అన్ని కేంద్రాల్లో తాగునీరు, ఇతర సౌకర్యాలు కచ్చితంగా ఉండాలని, 144 సెక్షన్ అమలు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.