ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్
కర్నూలు సమీపంలోని తడకనపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దిన్నెదేవరపాడుకు చెందిన హర్ష (20) అనే యువకుడు తన స్నేహితుడు నాయుడుతో కలిసి బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో హర్ష అక్కడికక్కడే మృతి చెందగా, నాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.