విలేఖరులకు శిక్షణ తరగతులకు కలెక్టర్‌కు ఆహ్వానం
ASR: ఈనెల 15, 16వ తేదీల్లో చింతపల్లిలో విలేఖరులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఏపీయూడబ్ల్యూజే చింతపల్లి ప్రెస్ క్లబ్ నాయకులు సతీష్, వనరాజు, దయానంద్, రాజు తెలిపారు. ఏపీటీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శిక్షణ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మంగళవారం పాడేరులో కలెక్టర్ దినేష్ కుమార్, ఐటీడీఏ పీవో శ్రీపూజను ఆహ్వానించారు.