ఉపాధి పనులను తనిఖీ చేసిన పీడీ
NDL: కోవెలకుంట్ల పట్టణ సమీపంలోని జర్రేరు వాగు వద్ద జరుగుతున్న ఉపాధి పనులను జిల్లా ఉపాధి హామీ పథకం పీడీ సూర్యనారాయణ మంగళవారం తనిఖీ చేశారు. ఉపాధి కూలీలతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. ఉపాధి కూలీల సంఖ్యను మరింత పెంచడానికి ప్రభుత్వ ఉపాధి హామీ పథకం సిబ్బంది కృషి చేయాలని సూచించారు. వివిధ గ్రామాలలో ఉపాధి పథకం కింద జరుగుతున్న సీసీ రోడ్లను ఆయన పరిశీలించారు.