జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే
NZB: నగరంలో హిందూ ఏకతా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం గోశాల నుంచి ఉమామహేశ్వరి ఆలయం వరకు నిర్వహించిన ర్యాలీని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ జెండా ఊపి ప్రారంభించారు. సంస్కృతి పరిరక్షణకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ ప్రేమ్ నారాయణ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.