పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
MHBD: మరిపెడ మండలంలో మంగళవారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.