బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ వార్డు సభ్యుడు
MHBD: తొర్రూరు మండలంలోని అమర్ సింగ్ తండాకు చెందిన 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని ధరావత్ మౌనిక ఉపేందర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి తొర్రూరు మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికలవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం జోరందుకుంది.