దారుణం: బస్సు ఎక్కబోయి కాలు కోల్పోయిన వ్యక్తి
RR: చేవెళ్ల స్థానిక బస్టాండ్‌లో బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి బస్సు చక్రాల కింద పడటంతో ఓ వ్యక్తి కాలు విరిగింది. తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. సదరు వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తోటి ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.