తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ మోస్తారుగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు సుమారు 12 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి వైకుంఠంలో 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం మొత్తం 77,879 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 25,520 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లుగా నమోదైందని ఆలయ అధికారులు తెలిపారు.