రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు

NLG: చింతపల్లి మండలం వింజమూరు గ్రామ సమీపంలో హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు బైక్ ఢీకొన్న ఘటనలో వింజమూరు గ్రామానికి చెందిన శ్రీను, భిక్షమయ్య అనే ఇద్దరు వ్యక్తులకు గాయాలైనట్లు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.