తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగ భగ
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరుగుతోంది. నంద్యాలలో అత్యధికంగా 41.59 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే పార్వతీపురం మన్యంలో 41, తిరుపతిలో 40 డిగ్రీలు, కర్నూలులో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మార్చిలోనే ఎండలు ముదురుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.