అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

TPT: గూడూరు ఎంపీడీవో ఆఫీసులో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. మండలంలోని వివిధ పంచాయతీల నుంచి ప్రజలు తరలి వచ్చారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు ఏంటో నేరుగా తెలుసుకున్నారు. సంబంధిత అర్జీలను అధికారులకు పంపి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.