VIDEO: పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

VIDEO: పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

సత్యసాయి: అమడగూరు పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, కేసుల నమోదు విధానం, పెండింగ్ కేసుల పురోగతిని సమగ్రంగా పరిశీలించారు. కేసుల విచారణలో ఆలస్యం చేయకుండా వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన పోలీస్ సిబ్బందికి ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకొని, బాధితులకు తక్షణ సేవలు అందించాలని సూచించారు.