నేడు పులిచెర్లలో చల్లా రామచంద్రారెడ్డి పర్యటన

CTR: పులిచెర్ల మండలం ఎల్లంకివారిపల్లి పంచాయతీలో శనివారం ఉదయం 9 గంటలకు పుంగనూరు నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పర్యటించనున్నట్లు సింగిల్ విండో అధ్యక్షులు ధనంజయ నాయుడు, ఎంపీటీసీ సభ్యులు మునికృష్ణమనాయుడు తెలిపారు. పంచాయతీ పరిధిలోని దిగుమూర్తివారిపల్లిలో నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారన్నారు.