విశ్వవిద్యాలయంలో విద్యార్థుల నిరసన

విశ్వవిద్యాలయంలో విద్యార్థుల నిరసన

హైదరాబాద్‌: హైకోర్టు భవన నిర్మాణానికి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 55ను వెంటనే రద్దు చేయాలని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా శుక్రవారం విద్యార్థులు విశ్వవిద్యాలయంలో నిరసన చేపట్టి.. బంద్‌కు పిలుపునిచ్చారు. అనంతరం విశ్వవిద్యాలయంలో భారీ ర్యాలీ నిర్వహించారు.