ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన ఇద్దరిపై కేసు నమోదు.!
ADB: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కర్ర స్వామి తెలిపారు. మావలలోని 8వ వార్డులో బారపాటి పార్వతి, 9వ వార్డులో గెలిచిన అభ్యర్థి తండ్రి వెంగల్ రావుపై కేసులు నమోదు చేశామన్నారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తూ టపాసులు కాల్చారని వారిపై వేరు వేరుగా కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.