నేడు జిల్లా కేంద్రంలో ఉచిత కంటి శిబిరం

NGKL: జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ కార్యాలయంలోని గది నంబర్ 102లో బుధవారం కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ వెంకట దాస్ తెలిపారు. కంటి సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శిబిరానికి వచ్చేవారు ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు.