ఫలించని HYD ట్రాఫిక్ పోలీసుల ‘స్పెషల్ డ్రైవ్’

HYD: నగరంలో యాచకుల పునరావాసానికి ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న స్పెషల్ డ్రైవ్ ఉద్దేశం నీరుగారిందనడానికి ఇదే ఉదాహరణ. నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు గతనెల 30న పలు ప్రాంతాల్లోని 18మంది పురుష యాచకులను బేగంపేటలోని పునరావాస కేంద్రానికి తరలించారు. యాచకులు అక్కడ కనీసం గంట కూడా ఉండలేకపోయారు. మేమిక్కడ ఉండలేమంటూ ఒక్కరు తప్ప అందరూ మాకు కుటుంబాలున్నాయంటూ వెళ్లిపోయారు.