సాగర్ పైప్ లైన్ లీకై వృధాగా పోతున్న మంచినీరు

సాగర్ పైప్ లైన్ లీకై వృధాగా పోతున్న మంచినీరు

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని స్థానిక కందుకూరు రోడ్డులో బుధవారం సాగర్ పైపులైను పగిలి త్రాగునీరు వృధాగా పోతున్నాయని సీపీఎం నాయకులు బడుగు వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నాసిరకం పైపులైను నిర్మాణం వల్ల నిరంతరం నీటి వృధాగా పోతుందన్నారు. పైపుల డ్యామేజీ కొనసాగింపు జరుగుతూనే ఉంది. కానీ అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చేయాలన్నారు.